కాంగ్రెస్‌ ఎంపీపై అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మ స్థానిక కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు.

Published : 24 Sep 2023 05:36 IST

దిస్పుర్‌: కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మ స్థానిక కోర్టులో రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా తన కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ అందిందంటూ గొగొయ్‌ తప్పుడు ఆరోపణలు చేశారని రిణికి భూయాన్‌ శర్మ అన్నారు. ఈ మేరకు కామ్‌రూప్‌ మెట్రోపాలిటన్‌లోని సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) కోర్టులో కేసు  దాఖలు చేశామని ఆమె తరఫు న్యాయవాది ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. ‘ట్విటర్‌ వేదికగా తప్పుడు ఆరోపణలు చేసిన గౌరవ్‌ గొగొయ్‌పై నా క్లయింట్‌ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ప్రభుత్వ రాయితీ కోసం ఎన్నడూ దరఖాస్తు చేసుకోలేదని మేం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాం. సామాజిక మాధ్యమాల వేదికగా గొగొయ్‌ చేసిన ఆరోపణలు వాస్తవాలపై ఆధారపడి లేవు. ఆయన ఎటువంటి కసరత్తు చేయకుండానే ఆరోపణలు చేశారు. మేం దీనిపై పోరాడతాం’ అని రిణికి శర్మ తరఫు న్యాయవాది తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు