భాజపా మాయ నుంచి యువత బయటకు రావాలి

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాజపా నిలబెట్టుకోలేదు. అబద్ధపు వాగ్దానం ఎందుకు చేశారని యువత ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తోంది.

Published : 27 Mar 2024 04:54 IST

డాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాజపా నిలబెట్టుకోలేదు. అబద్ధపు వాగ్దానం ఎందుకు చేశారని యువత ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తోంది. యువతీ యువకులు తమ తలరాతను తామే మార్చుకోవాలి. భాజపా సృష్టించిన మాయా ప్రపంచం నుంచి బయటకు రావాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక యువ న్యాయ్‌లో భాగంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం వచ్చే ఉద్యోగమిస్తాం.

రాహుల్‌ గాంధీ


అటల్‌ పింఛను పథకాన్ని సరిగా రూపొందించలేదు

సంఘటిత కార్మికులకు ఉద్దేశించిన అటల్‌ పింఛను యోజన ప్రచారంలో తప్ప.. వాస్తవంలో లబ్ధిదారులకు చేరడం లేదు. ప్రతి ముగ్గురు చందాదారుల్లో ఒకరు దాన్నుంచి వైదొలుగుతున్నారు. టార్గెట్‌లను పూర్తిచేసేందుకు చాలామంది బ్యాంకు ఉద్యోగులు.. అనుమతి తీసుకోకుండానే అనేక మంది కార్మికులను ఆ పథకంలో చేర్చారని ఓ సర్వేలో తేలింది. ఇందులో 83% మంది వెయ్యి రూపాయల పింఛను శ్లాబులో ఉన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరును చూస్తే.. వారికి ఆ మొత్తం ఏ మూలకూ సరిపోదు. అటల్‌ పింఛను యోజనను ప్రభుత్వం సరిగా రూపొందించలేదు.

 జైరాం రమేశ్‌


వాస్తవాలను విస్మరించారు

టల్‌ పింఛను యోజన విషయంలో జైరాం రమేశ్‌ వాస్తవాలను విస్మరించి మాట్లాడుతున్నారు. ఏడాదికి కనీసం 8% చొప్పున ప్రతిఫలం అందేలా దాని చందాదారులకు ప్రభుత్వ హామీ ఉంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం- పేదలు, అల్పాదాయ వర్గాలకు పింఛను అందించడం. కానీ బీదలకు పింఛను అందకుండా చేయడమే కాంగ్రెస్‌ ఉద్దేశంలా ఉన్నట్లు కనిపిస్తోంది.

 నిర్మలా సీతారామన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని