కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్‌ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది.

Updated : 30 Apr 2024 07:10 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్‌ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. ఆ మేరకు వేతన సవరణను అనుసరించి  ఉద్యోగులకు 50 శాతం డీఏ పెరిగినప్పుడల్లా పిల్లల విద్యా భత్యం, హాస్టల్‌ రాయితీ 25 శాతం పెరగనుంది. ఆ ప్రకారం వాస్తవ వ్యయంతో సంబంధం లేకుండా విద్యా భత్యాన్ని రూ.2,812.50గా, హాస్టల్‌ రాయితీని రూ.8,437.50 స్థిరంగా అందిస్తారు. అలాగే దివ్యాంగ పిల్లలను కలిగిన ఉద్యోగులకు విద్యా భత్యంగా రూ.5,625, దివ్యాంగులైన పిల్లలు కలిగిన మహిళా ఉద్యోగులకు ప్రత్యేక భత్యంగా రూ.3,750 చెల్లిస్తారు. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని