అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు

అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు.

Published : 08 May 2024 05:51 IST

రాంగోపాల్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్య

లఖ్‌నవూ: అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. ‘అసలు ఆలయాలను కట్టేది ఇలాగేనా? ఓసారి పురాతన ఆలయాలను చూడండి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎక్కడా ఇలా నిర్మించలేదు. వాస్తుప్రకారం చూసినా ఈ నిర్మాణం సరిగా లేదు. ప్రణాళికే బాగాలేదు’ అని యాదవ్‌ ఓ టీవీ ఛానల్‌కు వివరించారు. విపక్ష నేతలు అయోధ్యలో నూతన రామాలయానికి ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాము శ్రీరాముడికి ప్రతిరోజూ దండం పెట్టుకుంటామని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌, ఇండియా కూటమి అసలు స్వరూపమేమిటో రాంగోపాల్‌ ప్రకటన చాటుతోందని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ మండిపడ్డారు. ‘ఓటుబ్యాంకు కోసం ఇలాంటివారు దేశ విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. శ్రీరాముడి అస్తిత్వాన్ని సవాల్‌ చేస్తున్నారు. ఇలా చేసినవారికి ఎలాంటి గతి పడుతుందో చరిత్రే సాక్ష్యం’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు