కేజ్రీవాల్‌ బెయిల్‌పై రేపు సుప్రీం ఉత్తర్వులు

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది.

Published : 09 May 2024 04:13 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. తన అరెస్టు అక్రమం అంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా ఆ రోజే వాదనలు విననుంది. ఈ విషయాన్ని బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మరో కేసు విచారణ సందర్భంగా తెలిపారు.

కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం వాదనలు విన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెయిలిస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించకూడదని కూడా కేజ్రీవాల్‌కు తెలిపింది. దీంతో బెయిల్‌పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తిహాడ్‌ జైలులో ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా జ్యుడిషియల్‌ కస్టడీని బుధవారం దిల్లీ కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని