ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భువనేశ్వర్‌ ఐఐటీలు చేతులు కలిపాయి.

Published : 09 May 2024 04:19 IST

డీఆర్‌డీవో, భువనేశ్వర్‌ ఐఐటీ కసరత్తు

భువనేశ్వర్‌: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భువనేశ్వర్‌ ఐఐటీలు చేతులు కలిపాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు ఒక అంగీకారం కుదిరింది. డీఆర్‌డీవోలోని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ క్లస్టర్‌ అధిపతి బినయ్‌ దాస్‌, ఇతర శాస్త్రవేత్తలు, ఐఐటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఎలక్ట్రానిక్స్‌ యుద్ధవ్యవస్థలు, ఏఐ ఆధారిత నిఘా సాధనాలు, పవర్‌ సిస్టమ్స్‌, రాడార్‌ వ్యవస్థలను భువనేశ్వర్‌ ఐఐటీ నిపుణులు రూపొందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని