భద్రతా మండలికి భారత్‌ 5 లక్షల డాలర్లు

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ ఫండ్‌కు భారత్‌ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది.

Published : 09 May 2024 04:27 IST

వాషింగ్టన్‌: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్‌ ఫండ్‌కు భారత్‌ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. భద్రతామండలి ఉగ్రవాద నిరోధక కార్యాలయం(యూఎన్‌ఓసీటీ)లో ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్‌ వోరోన్కోకు తానే స్వయంగా విరాళాలను అందించినట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మంగళవారం వెల్లడించారు. ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొవడానికి సభ్యదేశాల సామర్థ్యాన్ని పెంపొందించడంలో యూఎన్‌ఓసీటీ ఆదేశాలకు భారత్‌ కట్టుబడి ఉందని, తాజా విరాళం దానికి నిదర్శనమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని