ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..

పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్‌భవన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 09 May 2024 04:28 IST

 పోలీసులు, మమతకు తప్ప..: బెంగాల్‌ గవర్నర్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్‌భవన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పోలీసులకు మినహా 100 మందికి చూపడానికి తాము సిద్ధమని రాజ్‌భవన్‌ బుధవారం ఎక్స్‌లో పేర్కొంది. ఇందుకోసం పౌరులెవరైనా ఈమెయిల్‌, ఫోన్‌ ద్వారా అభ్యర్థనలు తమకు పంపవచ్చని తెలిపింది. అయితే మొదటగా అభ్యర్థించిన వంద మందికి మాత్రమే గవర్నర్‌ నివాసంలో గురువారం ఉదయం సీసీటీవీ ఫుటేజిని చూపుతామని పేర్కొంది. లైంగిక వేధింపుల అభియోగాల నడుమ దర్యాప్తు జరపడానికి రాజ్‌భవన్‌ తమకు సహకరించడం లేదని పోలీసులు చేస్తున్న ఆరోపణలను ఎండగట్టడానికి ‘సచ్‌ కే సామ్‌నే’ పేరుతో ఓ కార్యక్రమాన్ని గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ ప్రారంభించినట్లు రాజ్‌భవన్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని