Fake News: నకిలీ వార్తల వ్యాప్తి.. 8 యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం కొరడా

లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాలపై నిషేధం, భారత సైన్యం సహా వివిధ అంశాలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఎనిమిది యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. 

Updated : 09 Aug 2023 14:46 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాలు (Social Media), యూట్యూబ్‌ ఛానెళ్ల (YouTube Channels) ద్వారా నకిలీ వార్తలు (Fake News) వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్‌చెక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అలాగే,  తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోన్న పలు యూట్యూబ్ ఛానెళ్లు, సామాజిక మాధ్యమ ఖాతాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. తాజాగా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న 8 యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

యహా సచ్‌ దేఖో (Yahan Sach Dekho), క్యాపిటల్‌ టీవీ (Capital TV), కేపీఎస్‌ న్యూస్‌ (KPS News), సర్కారీ వ్లోగ్‌ (Sarkari Vlog), ఎర్న్‌ టెక్‌ ఇండియా (Earn Tech India), ఎస్‌పీఎన్‌9 న్యూస్‌ (SPN9 News), ఎడ్యుకేషన్‌ దోస్త్‌ (Educational Dost), వరల్డ్‌ బెస్ట్ న్యూస్‌ (World Best News) అనే 8 యూట్యూబ్‌ ఛానెళ్లు లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాలపై నిషేధం, భారత సైన్యం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ పథకాలు, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన, పాన్‌కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌ వంటి వివిధ అంశాల గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నట్లు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్ విభాగం గుర్తించింది.

‘మణిపుర్‌లో దేశాన్ని హత్య చేశారు..’ : లోక్‌సభలో నిప్పులుచెరిగిన రాహుల్‌

ఈ ఛానెళ్లకు సుమారు 23 మిలియన్‌ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అలాగే, ఒక్కో ఛానల్‌కు 18 కోట్లుకు పైగా వ్యూస్‌ ఉన్నాయని వెల్లడించింది. ఈ చానళ్లు అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో ప్రామాణికమైన, విశ్వసనీయమైన, సురక్షిత వార్తల ప్రసారం ఉండేలా చూసుకోవడం తమ బాధ్యతని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని బలహీనపర్చేలా సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌ ఛానెళ్లు ప్రయత్నిస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని