Vaccination: కరోనా టీకా పంపిణీలో కీలక మైలురాయి..!

గత ఏడాది ప్రారంభం నుంచి నిరంతరాయంగా సాగుతోన్న కరోనా టీకా కార్యక్రమం మరో మైలురాయిని చేరుకుంది.

Published : 04 Jul 2022 23:29 IST

90 శాతం మంది వయోజనులకు రెండు డోసుల టీకా

దిల్లీ: గత ఏడాది ప్రారంభం నుంచి నిరంతరాయంగా సాగుతోన్న కరోనా టీకా కార్యక్రమం మరో మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు రెండు డోసుల టీకా అందిందని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. 

‘ప్రధాని మోదీజీ సబ్‌కా సాత్, సబ్‌కా ప్రయాస్‌ నినాదానికి తగ్గట్టుగా భారత జనాభాలో 90 శాతం మంది జనాభాకు రెండు డోసుల టీకా అందింది. టీకా పంపిణీలో మరింత ముందుకు వెళ్లడానికి మార్గాన్ని చూపింది. మహమ్మారిపై జరుపుతోన్న పోరులో కలిసికట్టుగా విజయం సాధిస్తాం’ అని మాండవీయ ట్వీట్ చేశారు. 2020 ప్రారంభంలో దేశంలో కరోనా మహమ్మారి అడుగుపెట్టింది. వైరస్‌ కట్టడి నిమిత్తం కేంద్రం గత ఏడాది జనవరిలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని కింద ఈ రోజు వరకు దాదాపు 198 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. ఈ కార్యక్రమం కింద 12 ఏళ్లు పైబడిన పిల్లలకూ టీకా వేస్తున్నారు. అలాగే ప్రికాషనరీ డోసుల పంపిణీ కూడా జరుగుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు