India Corona: 8 వేలకు చేరువలో కొత్త కేసులు..

దేశంలో కరోనా(Coronavirus) కొత్త కేసులు పెరుగుతున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. 

Updated : 12 Apr 2023 11:00 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ(ministry of health) వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో రోజువారీ పాజిటివిటీ 3.65 శాతానికి చేరింది.

తాజా వ్యాప్తితో క్రియాశీల కేసులు(Active cases) గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 40వేల(0.09శాతం)కు చేరింది. రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. కేంద్రం 11 మరణాలను ప్రకటించగా.. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు