Rajyotsava Award: ఇస్రో ఛైర్మన్‌ సహా 68 మందికి ‘రాజ్యోత్సవ అవార్డు’

రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ పురస్కారాలను ప్రకటించింది.

Published : 31 Oct 2023 20:07 IST

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌కు కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు(Rajyotsava award)ను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను ఆయనతో పాటు 68మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించే వారికి గౌరవ సూచకంగా ఏటా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంటుంది. కర్ణాటకలో రెండో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ఈ అవార్డుల్ని నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రదానం చేస్తారు.

నవంబరు 2న.. లోక్‌సభ కమిటీ ముందుకు మహువా మొయిత్రా

ఈ ఏడాది వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 68 మందితో పాటు 10 సంస్థలకు కూడా ఈ పురస్కారాలను ఇవ్వనున్నట్లు కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడగి వెల్లడించారు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేసే సమయంలో ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది పురస్కారాలకు ఎంపికైన వ్యక్తులు, సంస్థల జాబితాలో 13 మంది మహిళలు, 64 మంది పురుషులు, ఒక హిజ్రా ఉన్నట్లు వివరించారు. ఈ పౌర పురస్కారం కింద రూ.5లక్షల నగదుతో పాటు 25 గ్రాముల బంగారు పతకాన్ని అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని