DY Chandrachud: చీఫ్ జస్టిస్‌గా డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైంది.
దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం వెల్లడించారు. ఇందుకు రాష్ట్రపతి అనుమతి లభించినట్లు తెలిపారు. ప్రస్తుత సీజేఐ యు.యు.లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. తదుపరి సీజేఐగా చంద్రచూద్ బాధ్యతలను నిర్వర్తించనున్నార. ఆయన రెండేళ్లపాటు సేవలందించి 2024 నవంబరు 10న పదవీ విరమణ చేస్తారు.
సుప్రీంకోర్టు 50వ సీజేగా చంద్రచూడ్ పేరును జస్టిస్ యు.యు. లలిత్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 11న సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 27న ఈ ఉన్నత పదవిని అధిరోహించిన జస్టిస్ యు.యు.లలిత్.. 74 రోజులపాటు మాత్రమే సీజేఐగా కొనసాగి వచ్చే నెల 8న రిటైర్ కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harmilan Bains: 13 ఏళ్ల వయసులోనే నిషేధం... ఆపై వరుస గాయాలు.. హర్మిలన్ పోరాటమిదీ!
-
Meta: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..!
-
Rajeshwari Kumari: అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయ... రజత పతకధారి రాజేశ్వరి కథ ఇదీ!
-
HarishRao: మాటలు చెప్పే సర్కార్ కావాలా? చేతల సర్కార్ కావాలా?: హరీశ్‌రావు
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్