Karnataka:14రోజుల కఠిన కర్ఫ్యూ.. రవాణా బంద్‌!

దేశంలో కరోనా వైరస్‌  అంతకంతకూ విజృంభిస్తున్న వేళ దేశం మరోసారి కఠిన ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్‌ అమలు పరుస్తుండగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు...

Updated : 26 Apr 2021 15:13 IST

దిల్లీ, మహారాష్ట్ర కన్నా  పరిస్థితి దారుణమన్న సీఎం

బెంగళూరు: దేశంలో కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తున్న వేళ దేశం మరోసారి కఠిన ఆంక్షల వలయంలోకి జారుకుంటోంది. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్‌ అమలు పరుస్తుండగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం 14 రోజుల కఠిన కర్ఫ్యూ ప్రకటించింది. ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ, బెంగళూరులో వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వైరస్‌ కట్టడి కాకపోవడంతో మంగళవారం రాత్రి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్టు సీఎం యడియూరప్ప వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తోందన్నారు. మహారాష్ట్ర, దిల్లీ కంటే పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని వెల్లడించారు. 45 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే టీకా వేయిస్తోందన్నారు. మంగళవారం నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్టు తెలిపారు. నిత్యవసర వస్తువుల విక్రయాలను ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు అనుమతిస్తామని స్పస్టంచేశారు.

ఈ రెండు వారాల పాటు ప్రజా రవాణా సైతం నిలిచిపోనుంది. వస్త్ర రంగంతో పాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలపై ఎలాంటి నిషేధాజ్ఞలు ఉండవని స్పష్టంచేశారు. కర్ణాటకలో నిన్న ఒక్కరోజే 34వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 143మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్క బెంగళూరు అర్బన్‌లోనే 20733 కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు దాదాపు 20శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు