Leopard: కాలేజీ క్యాంపస్‌లో చిరుత సంచారం.. స్థానికుల్లో భయం.. భయం!

తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ చిరుత పులి కాలేజీ క్యాంపస్‌లో సంచరించడం కలకలం రేపుతోంది. అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనలకు ......

Published : 29 Dec 2021 23:19 IST

కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ చిరుత పులి కాలేజీ క్యాంపస్‌లో సంచరించడం కలకలం రేపుతోంది. అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున చిరుతపులి ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లే ముందు ఓ కుక్కపై దాడిచేసి చంపేసింది.  కాలేజీ వాచ్‌మెన్‌ ఆ మృతదేహాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి గత కొన్ని నెలలుగా చిరుత అక్కడ సంచరించినట్టుగా ఆనవాళ్లు గుర్తించినట్టుగా స్థానికులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అయితే, అదృష్టవశాత్తు పండుగ సీజన్‌ నేపథ్యంలో కళాశాలకు సెలవులు కావడంతో అక్కడ ఎవరూలేరన్నారు. మడుక్కరై అడవులకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో చిరుత సంచారంపై ఇప్పటికే గ్రామస్థులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారనీ.. కొన్ని రోజుల క్రితం దాని కదలికలపై వీడియోను కూడా అందజేశారన్నారు. ఈ చిరుత జనావాసాల్లోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారని పోలీసులు తెలిపారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని