Anand Mahindra: అక్టోబర్‌లో వర్షాలు.. మహీంద్రా మనసులో పలు ప్రశ్నలు..!

అక్టోబర్‌లో కూడా విరివిగా వానలు కురుస్తున్న క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా మనసులో పలు ప్రశ్నలు తలెత్తాయి.

Published : 20 Oct 2022 01:38 IST

ముంబయి: వర్తమాన పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో కూడా రుతుపవనాలు ప్రభావం చూపడంపై ఆయన స్పందించారు. ఈ అస్థిరతతో ఆయన మనసులో కొత్త ప్రశ్నలు ఉదయించాయి. 

చలితో వణకాల్సిన అక్టోబర్‌లో కూడా వర్షాలు విరివిగా కురుస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కొన్ని రాష్ట్రాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌లు కూడా జారీ అయ్యాయి. ఈ వివరాలతో ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. దీనిపై మహీంద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ‘వెనక్కి మళ్లేందుకు రుతుపవనాలకు ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఈ వాతావరణ చక్రం శాశ్వతంగా మారుతుందా..? విత్తనాలు వేసే సమయాన్ని రైతులు మార్చుకోవాల్సి ఉందా..? దీనిపై వ్యవసాయ నిపుణులు ఏం ఆలోచిస్తున్నారు..? మన ఆహార భద్రత ప్రమాదంలో పడొచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపై ఆన్‌లైన్‌లో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రుతుపవనాల క్రమంలో మార్పు వచ్చిందో, లేదో నిర్ధారించుకునేందుకు మరికొంత సమయం వేచి చూడాలని కొందరు అభిప్రాయపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని