అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా: కిషన్‌రెడ్డి

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధి, పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ హయాంలో,..

Updated : 24 Sep 2022 17:06 IST

దిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి, పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని.. ఆటంకాలన్నీ తొలగిపోయాయని వివరించారు. మరింత మెరుగుపర్చేందుకు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలి ఆర్గానిక్‌ సాగు రాష్ట్రంగా సిక్కిం నిలిచిందని పేర్కొన్నారు. అయితే కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో పనులు నెమ్మదించాయని.. త్వరలోనే ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తానని కిషన్‌ రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని