PM Modi: ‘డ్రోన్‌ దీదీ’ పథకంతో మహిళలకు మరిన్ని అవకాశాలు: ప్రధాని మోదీ

సాంకేతిక రంగాల్లో మహిళలు దూసుకెళుతున్నారని ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 

Published : 11 Mar 2024 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో సాంకేతిక విప్లవాన్ని మహిళలే ముందుండి నడిపిస్తారని ప్రధాని మోదీ (PM Modi) ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు ఆయన దిల్లీలో జరిగిన సశక్తి నారీ వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ 21వ శతాబ్దంలో మహిళలు ఐటీ, స్పేస్‌, సైన్స్‌ రంగాల్లో ఎలా పేరు తెచ్చుకొంటున్నారో చూస్తున్నాం. ప్రపంచంలోనే కమర్షియల్‌ విమానాలను నడిపే మహిళా పైలట్ల సంఖ్య భారత్‌లోనే అత్యధికం. రానున్న రోజుల్లో దేశంలో డ్రోన్‌ సాంకేతికత మరింత విస్తరించనుంది. అసంఖ్యాక అవకాశాలు ‘నమో డ్రోన్‌ దీదీ’లకు లభించనున్నాయి. గత పదేళ్లలో దేశంలోని స్వయం సహాయక బృందాల విస్తరణ అనేది ఓ పరిశోధించదగిన అంశం. అవి మహిళా సాధికారతలో చరిత్ర సృష్టించాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు. 

ఇదే సమయంలో ప్రతిపక్షాల తీరును మోదీ తప్పుపట్టారు. ‘‘నేను మహిళల సాధికారతపై మాట్లాడిన ప్రతిసారీ కాంగ్రెస్‌ వంటి పార్టీలు అవహేళన చేస్తుంటాయి. మోదీ పథకాలు క్షేత్రస్థాయి అనుభవాలకు లభించిన ఫలితాలు’’ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్‌పతి దీదీల విజయగాథలను వెల్లడించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలకు రూ.2,000 కోట్లు మూలధన సహాయ నిధిని అందించారు. దీంతోపాటు ఈ బృందాలకు రూ.8,000 కోట్లు విలువైన బ్యాంక్‌ రుణాలను అందించారు. 

వైకాపా ‘సిద్ధం’ సభలో జనమంతా గ్రాఫిక్స్: లోకేశ్‌

ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 1,000 మంది మహిళలకు డ్రోన్లను పంపిణీ చేశారు. ఇప్పటికే వీటి వినియోగంపై వీరికి శిక్షణ ఇచ్చారు. ఈ పథకం కింద దాదాపు 15,000 స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వ్యవసాయంలో వీటి వాడకంపై శిక్షణ ఇవ్వాలన్నది దీని లక్ష్యం. పంట పర్యవేక్షణ, ఎరువుల పిచికారీ, విత్తనాలు వేయటం వంటివి నేర్పిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని