Nobel Prize: ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ వీరికే..

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన

Updated : 11 Oct 2021 16:53 IST

స్టాక్‌హోం: ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. అయితే ఇందులో సగం పురస్కారాన్ని డేవిడ్‌ కార్డ్‌కు ఇవ్వగా.. మిగతా సగాన్ని జాషువా, గైడో పంచుకోనున్నారు. 

కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించి పరిశోధనాత్మక సహకారం అందించినందుకు గానూ డేవిడ్‌ కార్డ్‌కు నోబెల్ అందిస్తున్నట్లు అకాడమీ వెల్లడించింది. ఇక ఆర్థికశాస్త్రానికి సంబంధించి విశ్లేషణాత్మకమైన పరిశోధనలపై సహకారం అందించినందుకు జాషువా, గైడోలకు కూడా పురస్కారం ఇస్తున్నట్లు తెలిపింది. 

సామాజిక శాస్త్రాల్లో ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఉపాధి, ఉద్యోగుల వేతనంపై వలసవిధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓ వ్యక్తి సుదీర్ఘ విద్య అతని భవిష్యత్తుపై ఏ మేరకు పనిచేస్తుంది?వలసవిధానం తగ్గడం, వ్యక్తి సుదీర్ఘకాలం చదువుకోకపోవడం ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. అయితే ఈ ప్రశ్నలకు తమ సహజ పరిశోధనలతో సమాధానమివ్వొచ్చని శాస్త్రవేత్తలు డేవిడ్‌, జాషువా, గైడో రుజువు చేశారని అకాడమీ వీరిని ప్రశంసించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని