అందుకే ఇక్కడ కూర్చున్నా:సీఎం

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కోరలు చాస్తుండగా..తప్పక మాస్క్‌ ధరించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated : 06 Apr 2021 17:32 IST

మాస్క్‌ ప్రాముఖ్యతను వివరిస్తోన్న శివరాజ్‌ సింగ్

భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కోరలు చాస్తుండగా..తప్పక మాస్క్‌ ధరించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖానికి మాస్క్‌ ధరించకపోవడం నేరం కిందికి వస్తుందని అప్రమత్తం చేయడంతో పాటు, ప్రతి ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. మంగళవారం భోపాల్‌లోని మింటో హాల్‌లో స్వాస్థ్య ఆగ్ర(ఆరోగ్య అభ్యర్థన) పేరిట 24 గంటల పాటు మాస్కుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్ వేదికగా ప్రజలతో మాట్లాడటమే కాకుండా.. అక్కడి నుంచే విధులు నిర్వర్తించనున్నారు. 

‘మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం మన అలవాట్లలో భాగం కాదు. కొవిడ్ కట్టడికి వీటితో పాటు మనం ఇంకొన్ని చర్యలు తీసుకోవాలి. వీటిని మీ రోజూవారీ అలవాట్లలో భాగంగా చేసుకోవాలని కోరుతూ నేను ఇక్కడ కూర్చున్నాను. ఎవరైనా మాస్క్‌ ధరించకపోతే అది నేరం కిందికి వస్తుంది. ఎందుకంటే మన నిర్లక్ష్య వైఖరి మన పక్కన ఉండే వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నా కుటుంబం మాస్క్‌ ధరించేలా నేను చూసుకున్నాను. ఇక్కడ మాస్క్‌ అంటే మనందరి రక్షణ కవచం’ అంటూ ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ అవసరాన్ని చౌహాన్ వివరించారు. 

‘ప్రభుత్వపరంగా మహమ్మారితో పోరాడేందుకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరంతా తగిన సామాజిక ప్రవర్తనతో వైరస్ ఉద్ధృతిని ఆపాలి. కరోనాకు అడ్డుకట్ట వేయడానికి లాక్‌డౌన్ సులభమైన పరిష్కారం. అది సరైందని నేను భావించట్లేదు. పరిమిత లాక్‌డౌన్ పర్వాలేదు కానీ, శాశ్వత లాక్‌డౌన్ పరిష్కారం కాదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని