Corona: దేశంలో ఒమిక్రాన్ ప్రబలంగా ఉన్నా.. మరణాలు తగ్గడానికి అదే కారణం..!

దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డామినెంట్‌గా ఉందని గురువారం కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ కారణంగా మూడోవేవ్‌కు ఆజ్యం పోసిన ఈ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత, మరణాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 

Published : 27 Jan 2022 17:50 IST

దిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డామినెంట్‌గా ఉందని గురువారం కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ కారణంగా మూడోవేవ్‌కు ఆజ్యం పోసిన ఈ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత, మరణాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 

‘కరోనా రెండో దశలో అత్యధికంగా 4,14,188 కొత్త కేసులు రాగా.. 3,679 మరణాలు సంభవించాయి. అలాగే మూడో దశలో జనవరి 21, 2022న అత్యధింగా 3,47,254 కొత్త కేసులొచ్చాయి. 435 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మూడు శాతం మంది రెండు డోసుల టీకా తీసుకోగా.. ఇప్పుడు 75 శాతం మందికి పూర్తిస్థాయిలో టీకా అందింది’ అంటూ ఆరోగ్య శాఖ వివరించింది. టీకాలతో వ్యాధి తీవ్రత తగ్గినట్లు చెప్పింది. దేశంలో గత మూడు రోజులుగా మూడు లక్షలకు దిగువనే రోజువారీ కేసులొస్తున్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరింది. గతవారం మొత్తం మీద ఆ రేటు 17.75 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా 22లక్షలకు పైగా క్రియాశీల కేసులున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలోనే ఆ కేసులు చెరో మూడు లక్షలున్నాయి. 

95 శాతం మందికి మొదటి డోసు.. 

దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇప్పటివరకు 95 శాతం మంది మొదటి డోసు, 74 శాతం మందికి రెండు డోసులు అందాయి. 97.03 లక్షల మంది అర్హులకు ప్రికాషనరీ డోసు తీసుకున్నారు. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ విషయంలో.. 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సగటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. దేశంలో తగినన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయని, కరోనాపై పోరాటంలో సాధ్యమైనంత ఎక్కువ మంది టీకా తీసుకోవడం ముఖ్యమని ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ అన్నారు. ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని