Yogi adityanath: అది మొదలైతే.. ప్రపంచ పటంలో పాక్ ఉండదు: యోగి
ఉత్తర్‌ప్రదేశ్ రక్షణ కారిడార్‌లో (UPDIC) తయారైన ఫిరంగులు గర్జించడం మొదలు పెడితే పాకిస్థాన్ (Pakistan) ప్రపంచ పటం నుంచి అదృశ్యమవుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar pradesh)లో రక్షణ కారిడార్ (Defence corridor) అందుబాటులోకి రానుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం మొదలు పెడితే.. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ (Pakistan) దానంతట అదే అదృశ్యమవుతుందని అన్నారు. బుందేల్‌ఖండ్ రీజియన్‌లోని బాందాలో నిర్వహించిన కలింజార్ మహోత్సవ ప్రారంభ వేడుకల్లో ఆయన మాట్లాడారు. బుందేల్‌ఖండ్ రీజియన్‌ను అభివృద్ధి చేసేందుకు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించినట్లు యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. దీంతో చిత్రకూట్-దిల్లీ మధ్య ప్రయాణ సమయం 5.30 గంటలకు తగ్గిందని అన్నారు.
చిత్రకూట్‌లో త్వరలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా జరుగుతుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రాష్ట్రంలో రక్షణ కారిడార్ నిర్మాణం జరుగుతోందన్న ఆయన.. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం ప్రారంభిస్తే.. పాక్ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని, ప్రపంచ పటం నుంచి ఆ దేశం దానంతట అదే అదృశ్యమవుతుందని అన్నారు. భారత్ ఏరోస్పేస్, రక్షణ విభాగాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (యూపీడీఐసీ)ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.3,700కోట్లతో ఈ ప్రాజెక్టును 2018 ఆగస్టులో ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిగ్నల్‌కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్‌లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్‌నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్‌లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.