Opposition Protest: రోడ్డెక్కిన ప్రతిపక్ష ఎంపీలు.. దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు నేడు రోడ్డెక్కారు. అదానీ వ్యవహారం, ఇతర అంశాలపై నిరసన ర్యాలీ (Opposition Protest) చేపట్టారు. దీంతో దిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Published : 24 Mar 2023 14:34 IST

దిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్‌ (Adani Issue) వ్యవహారం, రాహుల్‌ (Rahul Gandhi)కు జైలు శిక్ష తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీ ఎంపీలు శుక్రవారం ఆందోళన (Opposition Protest)కు దిగాయి. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు నేడు పార్లమెంట్‌ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే, వీరిని పోలీసులు అడ్డుకోవడంతో దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదానీ - హిండెన్‌బర్గ్‌ (Hindenberg Research) వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ JPC)తో విచారణ చేపట్టాలని కొంతకాలంగా విపక్షాలు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే సభలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో తొలుత పార్లమెంట్‌ ప్రాంగణంలో నిరసైన చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు.. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌ వరకు ప్రదర్శన చేపట్టాయి.

‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అంటూ భారీ బ్యానర్‌ పట్టుకుని కాంగ్రెస్‌ (Congress) సహా సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆమ్‌ ఆద్మీ తదితర పార్టీ నేతలు ర్యాలీ చేపట్టాయి. అయితే, వీరి ప్రదర్శనను దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. కొందరు విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో విజయ్‌ చౌక్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని