PM Modi: ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’ మంత్రానికి రాముడే స్ఫూర్తి: మోదీ

కేంద్ర ప్రభుత్వం పఠిస్తున్న ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’ మంత్రానికి రాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 23 Jan 2024 20:37 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం పఠిస్తున్న ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’ మంత్రానికి రాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీని ఫలితం ప్రస్తుతం అన్ని చోట్లా కనిపిస్తోందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందేందుకు ఈ మంత్రమే సహకరించిందన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘‘ మీరు రాసిన లేఖ అందే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిపోయి ఉంది. దాని నుంచి బయటపడేందుకు అది ఎంతగానో సహాయపడింది. అయోధ్య ధామ్‌లో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని దిల్లీకి తిరిగి వచ్చాను’’ అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.

అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని 11 రోజులపాటు ఎంతో నిష్ఠగా కార్యక్రమాలను నిర్వహించిన మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల క్రితం లేఖ రాసిన సంగతి తెలిసిందే. సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠకు రాముడు ప్రతీక అని ఆమె అన్నారు. సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తొస్తుందని, సత్యనిష్ఠ గొప్పతనాన్ని రాముడి వల్లే గ్రహించానని ఆమె లేఖలో పేర్కొన్నారు. జాతి నిర్మాతలకు రామాయణం ప్రేరణగా నిలిచిందన్నారు. పీఎం జన్‌మన్‌ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేసిన సంగతిని ముర్ము తన లేఖలో ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు