JK: జవాన్లతో కలిసి దసరా వేడుకలు జరుపుకోనున్న రాష్ట్రపతి

గత సంప్రదాయాలకు భిన్నంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈసారి దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ......

Published : 13 Oct 2021 21:04 IST

దిల్లీ: గత సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈసారి దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటుంటారు. అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు, ఎల్లుండి జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. గురువారం ఆయన లేహ్‌లోని సింధు ఘాట్‌ వద్ద సింధు దర్శన్‌ పూజలో పాల్గొంటారు. సాయంత్రం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బలగాలతో మాట్లాడతారు. ఈ నెల 15న ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన అధికారులు, జవాన్లతో మాట్లాడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని