Jagdeep Dhankhar: పార్లమెంట్‌లో నిరసన ఘటన.. ఉపరాష్ట్రపతికి మోదీ ఫోన్‌

పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన నిరసన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ప్రధాని మోదీ(Modi) విచారం వ్యక్తం చేశారు. 

Updated : 20 Dec 2023 11:56 IST

దిల్లీ: పార్లమెంట్‌ (Parliament) ప్రాంగణంలో జరిగిన నిరసన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల మర్యాదకు భంగం కలిగించేలా ఉండకూడదని హితవు పలికారు. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ(Modi) కూడా తనకు ఫోన్‌ చేశారని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) వెల్లడించారు. దానిపై మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని ట్విటర్ వేదికగా తెలియజేశారు. 

‘పార్లమెంట్‌ ప్రాంగణంలో చోటుచేసుకున్న నిరసన ఘటనపై ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. ఈ పవిత్ర ప్రదేశంలో ఎంపీలు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా తానుకూడా అలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కానీ, పార్లమెంట్‌ వేదికగా రాజ్యాంగ పదవిలో ఉన్న వారి విషయంలో ఇలా జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన నా కర్తవ్య నిర్వహణను అడ్డుకోలేదని మోదీ(Modi)కి వెల్లడించాను. ఇవన్నీ నా మార్గాన్ని మార్చలేవని, నేను రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాను’ అని ధన్‌ఖడ్‌ ట్వీట్‌లో వెల్లడించారు.

డీప్‌ఫేక్ కలవరం.. ఆ దృశ్యాలను నమ్మేముందు జాగ్రత్త: మోదీ

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలనే డిమాండుతో ఉభయ సభలు దద్దరిల్లడంతో.. గురువారం నుంచి ఇప్పటివరకు మొత్తం 141 మంది సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. సస్పెన్షన్ల అనంతరం విపక్ష సభ్యులు పార్లమెంటు భవన మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ తృణమూల్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ చేసిన హాస్య ప్రదర్శనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వీడియో తీశారు. కొందరు నేతలు స్పీకర్‌ను అనుకరించారు. ఈ ఘటన తనను బాధకు గురిచేసిందని ధన్‌ఖడ్‌ తప్పుబట్టారు. మరోపక్క.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కేసు నమోదైంది. న్యాయవాది అభిషేక్ గౌతమ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని