Coronaపై పోరు.. పంజాబ్‌లో కఠిన ఆంక్షలు 

కరోనా కేసులు పెరుగుతుండటంతో పంజాబ్‌ ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది...

Published : 26 Apr 2021 21:43 IST

చండీగఢ్‌: కరోనా కేసులు పెరుగుతుండటంతో పంజాబ్‌ ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వీకెండ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించింది. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ప్రతిరోజూ  రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుందని సీఎం అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నట్టు తెలిపారు.  ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా రెండోదశ విజృంభణ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా అనేక రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్‌లో 6980 కొత్త కేసులు రాగా.. 76మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 48వేలకు పైగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని