Ranveer Singh: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ ఏఐ వీడియో వైరల్‌

ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ వీడియో వైరల్‌ కాగా, తాజాగా రణ్‌వీర్‌సింగ్‌కు అదే పరిస్థితి ఎదురైంది. 

Published : 18 Apr 2024 17:46 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh)కు చెందిన ఏఐ జనరేటెడ్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఉంది. కొద్దిరోజుల క్రితం మరో నటుడు ఆమిర్‌ఖాన్‌కు చెందిన ఇదేతరహా క్లిప్ నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఇటీవల రణ్‌వీర్‌ (Ranveer Singh) వారణాసిలో పర్యటించారు. అక్కడి నమోఘాట్ వద్ద ఆయనతో పాటు నటి కృతిసనన్‌ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. దానికిముందు కాశీ విశ్వనాథుడిని సందర్శించుకున్నారు. తర్వాత ఆధ్యాత్మిక నగరంలో పొందిన అనుభూతిని మీడియాకు వివరించారు. ఆ దృశ్యాలనే వాడిన ఏఐ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

‘ఏ పార్టీ కోసం ప్రచారం చేయలేదు..అది నకిలీ వీడియో’: ఆమిర్‌ఖాన్‌

కృత్రిమ మేధ (AI) ద్వారా డీప్‌ఫేక్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సరికొత్త సవాళ్లు విసురుతున్న విషయం తెలిసిందే. వాటి కట్టడికి ఓవైపు కేంద్రం, మరోవైపు సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు చేపడుతున్నా.. నకిలీల బెడద తప్పట్లేదు. ఇక ఎన్నికల సమయంలో ఇలాంటివి మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక తన గురించి వచ్చిన వీడియోపై ఇదివరకే ఆమిర్‌ స్పష్టత ఇచ్చారు. తాను ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయలేదని చెప్పారు. అలాగే దానిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని