పండుగ సీజన్: రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక
పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభించే ప్రమాదం ఉన్నందున రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) బుధవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ..........
దిల్లీ: పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభించే ప్రమాదం ఉన్నందున రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) బుధవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు రైల్వే స్టేషన్లలోకి వచ్చినప్పుడు, రైళ్లలో, రైల్వే పరిసరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తాము జారీచేసిన నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కొవిడ్ కట్టడే లక్ష్యంగా విధించిన ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రైల్వే చట్టం -1989లోని పలు సెక్షన్ల కింద జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఆర్పీఎఫ్ కీలక సూచనలివే..
* మాస్క్ ధరించకుండా రైల్వే పరిసరాలకు రావొద్దు.
* భౌతికదూరం పాటించాల్సిందే.
* కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా రైల్వే స్టేషన్లకు రావొద్దు. రైళ్లలోకి ప్రవేశించొద్దు.
* కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఇంకా ఫలితం రాకుండా స్టేషన్లోకి, రైళ్లలోకి వెళ్లొద్దు.
* రైల్వే స్టేషన్ వద్ద వైద్య బృందం చెకప్ చేయడాన్ని నిరాకరించి రైలెక్కినా చర్యలు తప్పవు.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా, చెత్తాచెదారం విసిరేసినా కఠిన చర్యలు.
* రైల్వే స్టేషన్లు/ రైళ్లలో అపరిశుభ్ర వాతావరణం సృష్టించి.. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దు.
* కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్‌కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్‌లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్‌బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదట రాయ్‌బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్‌సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్‌ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్‌స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు