Russia: యూకే నౌకను ఢీకొన్న సబ్‌మెరైన్‌..!

ఉత్తర అట్లాంటిక్‌లో రష్యా సబ్‌మెరైన ప్రమాదానికి గురైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. యూకే రాయల్‌ నేవీకి చెందిన హెచ్‌ఎంఎస్‌ నార్త్‌అంబర్లాండ్‌ను ఇది ఢీకొంది.

Published : 07 Jan 2022 23:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర అట్లాంటిక్‌లో రష్యా సబ్‌మెరైన్‌ ప్రమాదానికి గురైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. యూకే రాయల్‌ నేవీకి చెందిన హెచ్‌ఎంఎస్‌ నార్త్‌అంబర్లాండ్‌ను ఇది ఢీకొంది. నౌకకు చెందిన సోనార్‌ను సబ్‌మెరైన్‌ ఢీకొనడంతో కొన్ని వందల మీటర్ల పాటు ఈడ్చుకుపోయింది. యూకే రక్షణశాఖ అధికారులు దురదృష్టకర ఘటనగా దీనిని పేర్కొంటూ.. ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు ఆరోపించారు. 2020లో ఒక టెలివిజన్‌కు సంబంధించిన డాక్యూమెంటరీని చిత్రీకరిస్తుండగా.. ఈ ఘటన కెమెరాల్లో రికార్డ్‌ అయింది.

ఆర్కిటిక్‌ సర్కిల్‌లో హెచ్‌ఎంఎస్‌ నార్త్‌అంబర్లాండ్‌ రాడార్‌ నుంచి ఓ సబ్‌మెరైన్‌ అదృశ్యమైంది. దీంతో దీనిని వెతికేందుకు నార్త్‌అంబర్లాండ్‌ బయల్దేరి వెళ్లింది. ఈ ఫ్రిగెట్‌ యారో సోనార్‌ను వాడి ఆ సబ్‌మెరైన్‌ ఆచూకీ  పసిగట్టింది. అదే సమయంలో రష్యా సబ్‌మెరైన్‌ నీటిలోకి జారుకొనే సమయంలో  హెచ్‌ఎంఎస్‌ నార్త్‌అంబర్లాండ్‌ సోనార్‌ను ఢీకొంది. ఈ ఘటనను ఛానల్‌-5 సిబ్బంది కెమెరాల్లో బంధించారు. వారు ‘లైఫ్‌ ఎట్‌ సీ ’సిరీస్‌ను చిత్రీకరిస్తుండగా ఈఘటన చోటు చేసుకొంది. ఆ ఘటనలో రష్యా సబ్‌మెరైన్‌ ఎంత మేర దెబ్బతిన్నదో వివరాలు బయటకు రాలేదు. ఆర్కిటిక్‌ సర్కిల్‌లో ఇటీవల కాలంలో రష్యా సబ్‌మెరైన్ల కదలికలు గణనీయంగా పెరిగాయి. రాయల్‌ నేవీ ఫ్రిగేట్లు వీటిని గుర్తించేందుకు తరచూ పెట్రోలింగ్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా రాయల్‌ నేవీ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘2020లో రష్యా సబ్‌మెరైన్‌ కదలికలను గమనిస్తుండగా.. అది మా టోడ్‌ యారే సోనార్‌ను తాకింది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని