కరోనా: సముద్ర తీరంలో విద్యార్థులకు పాఠాలు

స్పెయిన్‌కు చెందిన ఓ స్కూల్‌ విభిన్నంగా ఆలోచించింది. తమ విద్యార్థులకు సముద్ర తీరంలో తరగతులు నిర్వహిస్తోంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులు సముద్రం ఒడ్డున ఆడుతూపాడుతూ విద్యను అభ్యసిస్తున్నారు....

Published : 20 Apr 2021 01:22 IST

మాడ్రిడ్‌: కరోనా మహమ్మారి విలయతాండవంతో ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ దాదాపుగా మూతబడ్డాయి. తరగతి గదిలో భౌతిక దూరం కష్టం కావడంతో అనేక పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. కానీ స్పెయిన్‌కు చెందిన ఓ స్కూల్‌ విభిన్నంగా ఆలోచించింది. తమ విద్యార్థులకు సముద్ర తీరంలో తరగతులు నిర్వహిస్తోంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులు సముద్రం ఒడ్డున ఆడుతూపాడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. సంగీతం, చిత్రలేఖనం, క్రీడా తరగతులను సముద్రం ఒడ్డునే నిర్వహిస్తున్నారు. చరిత్రను బోధించేందుకు ఉపాధ్యాయులు ఆ తరహా వస్త్రధారణ చేసి పాఠాలు చెప్పడం ప్రత్యేకంగా నిలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని