US: క్యాపిటల్‌ భవనానికి భద్రత కొనసాగింపు

అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడులకు అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మరో రెండు నెలల పాటు జాతీయ భద్రతా దళాన్ని అక్కడే మోహరించి ఉంచాలని పెంటగాన్‌ నిర్ణయించింది....

Published : 10 Mar 2021 23:48 IST

వాషింగ్టన్‌: అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడులకు అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మరో రెండు నెలల పాటు జాతీయ భద్రతా దళాన్ని అక్కడే మోహరించి ఉంచాలని పెంటగాన్‌ నిర్ణయించింది. అమెరికా రక్షణ మంత్రి అయాడ్‌ ఆస్టిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 2300 మంది నేషనల్‌ గార్డులు క్యాపిటల్‌ బిల్డింగ్‌ వద్ద విధుల్లో ఉండగా, క్యాపిటల్‌ పోలీసుల విజ్ఞప్తి మేరకు వారిని మే 23 వరకు కొనసాగించనున్నట్లు ఆస్టిన్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్‌ మొత్తంమీద ప్రస్తుతం 5,100 మంది నేషనల్‌ గార్డులు ఉన్నారు. వారికి అప్పగించిన విధుల గడువు మార్చి 12తో ముగియనుంది. తాజాగా ఆ గడువును మే 23 వరకు పొడిగించారు. రెండు నెలల క్రితం క్యాపిటల్‌ బిల్డింగ్‌పై ట్రంప్‌ మద్ధతుదారులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అప్పటినుంచి క్యాపిటల్‌తోపాటు వాషింగ్టన్‌లో నేషనల్‌ గార్డులను మోహరించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని