Parth Pawar: నా కుమారుడు చేసింది తప్పే..! అజిత్‌ పవార్‌

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తనయుడు ఇటీవల ఓ గ్యాంగ్‌స్టర్‌ను కలిశాడు. ఈ భేటీ కాస్త స్థానికంగా విమర్శలకు దారితీసింది.

Published : 26 Jan 2024 19:53 IST

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) చిక్కుల్లో పడ్డారు. ఆయన కుమారుడు ఓ గ్యాంగ్‌స్టర్‌ను కలిసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో తన కుమారుడు చేసింది తప్పేనని అంగీకరించిన అజిత్‌ పవార్‌.. అతడితో కలవకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. అజిత్‌ తనయుడు పార్థ్ పవార్‌ (Parth Pawar) ఇటీవల పలువురు ఎన్సీపీ నేతలతో కలిసి గ్యాంగ్‌స్టర్‌ గజానన్‌ మారణేను కలిశాడు. ఈ భేటీ కాస్త రాజకీయ విమర్శలకు దారితీసింది.

‘‘ఏదైతే జరిగిందో అది తప్పే. అలా చేసి ఉండకూడదు. నేను అతడి (పార్థ్‌)తో మాట్లాడతాను. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నాను. పార్టీ కార్యకర్తలు అతడిని అక్కడికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. భవిష్యత్తులో ఈ తరహా పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలని పోలీసులకు చెప్పాను. ఇది ఏ రాజకీయ నాయకుడికైనా జరగవచ్చు’’ అని అజిత్‌ వెల్లడించారు. ఆ గ్యాంగ్‌స్టర్‌ గతంలో ఓసారి పార్టీలో చేరాడని, అయితే.. అతడి గతం వెలుగులోకి వచ్చిన వెంటనే తొలగించినట్లు చెప్పారు.

రాజకీయాల్లో ఎవరికీ తలుపులు శాశ్వతంగా మూసి ఉండవు: సుశీల్‌ మోదీ

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సోదరుడి మనవడు, పార్టీ (శరద్‌ పవార్‌ వర్గం) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ను ఇటీవల ‘ఈడీ’ విచారించడంపైనా అజిత్‌ స్పందించారు. దర్యాప్తు సంస్థల పని అదేనని, నిజాయతీగా సమాధానం చెప్పడం సంబంధిత వ్యక్తుల బాధ్యతని చెప్పారు. తననూ ‘ఏసీబీ’ గతంలో ఐదు గంటల పాటు ప్రశ్నించిందని, అయితే.. జనాలను కూడగట్టి ప్రచారమేమీ చేయలేదన్నారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా.. రోహిత్ పవార్ ఇటీవల ఈడీ ముందు హాజరయ్యారు. ఆ సమయంలో దక్షిణ ముంబయిలోని పార్టీ కార్యాలయం వద్ద వందల మంది కార్యకర్తలు గుమిగూడి రోహిత్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు