Satyendar Jain: ఆప్‌నేత సత్యేందర్‌ జైన్‌కు సుప్రీంలో చుక్కెదురు

మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. 

Updated : 18 Mar 2024 14:23 IST

దిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్(Satyendar Jain) సాధారణ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న ఆయన్ను వెంటనే లొంగిపోవాలని న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

లొంగిపోయేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలంటూ జైన్ న్యాయవాది చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వైద్య కారణాలతో 2023 మే 26న జైన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం దానిని పొడిగిస్తూ వచ్చింది.

2015-16 సమయంలో జైన్‌ సంస్థలకు హవాలా నెట్‌వర్క్ ద్వారా పలు షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్లు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలో ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2022 మే 30న ఆయన్ను అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని