International flights: ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. విమాన సర్వీసుల రద్దును.....

Updated : 28 Sep 2021 19:36 IST

డీజీసీఏ తాజా ప్రకటన

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. విమాన సర్వీసుల రద్దును ఆగస్టు 31 వరకు కొనసాగించనున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రకటించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్నింటిని నడపనున్నట్టు తెలిపింది.  కరోనా కట్టడిలో భాగంగా గతేడాది మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులనూ నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 31వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు నెలాఖరు వరకు విమానాల రద్దు నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటనలో వెల్లడించింది. 

కరోనా వైరస్‌ ఉద్ధృతితో గతేడాది మార్చి నుంచి అంతర్జాతీయ పాసింజర్‌ విమాన సర్వీసుల్ని నిలిపివేసినప్పటికీ వందేభారత్‌ మిషన్‌ కింద కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ సహా దాదాపు 24 దేశాలకు విమానాలు నడపడంపై కేంద్రం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు అందించనున్నాయి. అయితే, తాజాగా ప్రకటించిన నిబంధనలు కార్గో విమానాలు, తాము ప్రత్యేక అనుమతులు జారీ విమానాలకు మాత్రం వర్తించవని డీజీసీఏ స్పష్టంచేసింది. ఇప్పటికే దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు యథాతథంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని