Covovax: 5 కోట్ల డోసుల ఎగుమతికి కేంద్రం అనుమతి!
అమెరికా సంస్థ నొవావాక్స్(కొవొవాక్స్) టీకాను భారీగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఈ టీకా 5 కోట్ల డోసులను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇండోనేసియాకు అందించనున్న సీరం ఇన్స్టిట్యూట్
దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే టీకా ఉత్పత్తి భారత్‌లో గణనీయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే ముందున్న సీరం ఇన్స్టిట్యూట్.. వివిధ దేశాలకు చెందిన టీకాలను కూడా ఇక్కడే తయారు చేస్తోంది. ఇదే సమయంలో అమెరికా సంస్థ నొవావాక్స్(కొవొవాక్స్) టీకాను భారీగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఈ టీకా 5 కోట్ల డోసులను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, భారీ స్థాయిలో ఇక్కడ తయారవుతున్నప్పటికీ కొవొవాక్స్ టీకాను భారత్‌లో వినియోగించేందుకు మాత్రం ఇంకా అనుమతి రాలేదు.
అమెరికా సంస్థ నోవావాక్స్ తయారు చేసిన కరోనా టీకాను భారత్‌లో కొవొవాక్స్ పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ఈ టీకా దాదాపు 90శాతం సమర్థత చూపించినట్లు అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వెల్లడైంది. దీంతో మే 17నుంచి భారత్‌లో ఉత్పత్తిని సీరం ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది. అనంతరం భారత్‌లో అత్యవసర వినియోగానికి అదే నెలలో కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ అత్యవసర వినియోగానికి ఇంకా అనుమతి రాలేదు. మరోవైపు దాదాపు కోటి డోసులకు వినియోగ గడువు డిసెంబర్ నాటికే ముగుస్తున్న నేపథ్యంలోనే కొవొవాక్స్‌ను ఎగుమతికి అనుమతి ఇవ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రాన్ని కోరింది. సమీక్షించిన ప్రభుత్వం ఇండోనేసియాకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 5కోట్ల డోసులు కలిగిన 50లక్షల వయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఇండోనేసియాకు అందించనుంది.
ఇదిలాఉంటే, అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ టీకా కొవిడ్‌ను నిరోధించడంలో 90శాతం సమర్థత కలిగినట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. ఓ మోస్తారు నుంచి తీవ్ర లక్షణాలున్న కేసుల్లో వైరస్‌ను వందశాతం ఎదుర్కొంటున్నట్లు తేలింది. అమెరికా, మెక్సికోలో దాదాపు 30వేల మందిపై జరిపిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి. దీంతో వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు భారత్‌లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో నొవావాక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సీరం ఇన్స్టిట్యూట్ దాదాపు 110కోట్ల డోసులను తయారు చేయనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్‌ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్‌ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?