ED: వోరా గురించి సోనియా చెప్పారు కానీ.. అలాంటి ఆధారాల్లేవ్‌..!

అసోసియేటెడ్ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌), యంగ్ ఇండియన్ మధ్య జరిగిన ఒప్పందాన్ని దివంగత నేత మోతీలాల్‌ వోరా చూసుకున్నారని నిరూపించే పత్రాలేవీ ఈడీకి లభించలేదు.

Published : 06 Aug 2022 01:30 IST

దిల్లీ: అసోసియేటెడ్ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌), యంగ్ ఇండియన్ మధ్య జరిగిన ఒప్పందాన్ని దివంగత నేత మోతీలాల్‌ వోరా చూసుకున్నారని నిరూపించే పత్రాలేవీ ఈడీకి లభించలేదు. ఈ మేరకు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. తమ విచారణకు హాజరైన ఏ ఒక్క నేత కూడా దానికి సంబంధించిన పత్రాలు సమర్పించలేదని చెప్పాయి.

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ.. కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తోంది. ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా విచారించింది. ఈ క్రమంలో ఏజేఎల్‌ టేకోవర్‌కు సంబంధించిన లావాదేవీల గురించి సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్‌ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఏజేఎల్‌, యంగ్‌ ఇండియన్‌ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసుకున్నారని ఆమె చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, పవన్ కుమార్‌ బన్సల్‌ కూడా ఇదే పేరును దర్యాప్తు సంస్థకు వెల్లడించారు. కానీ, తమ సమాధాన్ని బలపరిచే విధంగా పత్రాలను మాత్రం సమర్పించలేకపోయారు. కాగా, ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో విచారణ జరుగుతుండటంతో.. యంగ్‌ ఇండియన్‌ కార్యాలయాన్ని ఈడీ తాత్కాలికంగా సీజ్‌ చేసింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన మోతీలాల్‌ వోరా.. మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని