Vande Bharat: ‘వందేభారత్‌ వెంబడి పరుగెత్తి’.. తృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్న టీసీ!

అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ‘టీసీ’ అదుపుతప్పి పడిపోయాడు. అక్కడున్నవారు అప్రమత్తమై అతడిని పక్కకి లాగేశారు.

Published : 01 Jul 2023 01:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కదులుతున్న వందేభారత్‌ (Vande Bharat) రైలు ఎక్కబోయిన టీసీ అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన అహ్మదాబాద్‌ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్‌ రైలు ప్లాట్‌ఫాం నుంచి అప్పుడే కదులుతోంది. అప్పటికే దాని తలుపులు పాక్షికంగా మూసుకుపోయాయి. ఇంతలో అదే రైల్లో విధులు నిర్వహించాల్సిన టీసీ పరుగెత్తుకుంటూ ప్లాట్‌ఫాం మీదికి వచ్చారు. అప్పటికే రైలు క్రమంగా వేగం పుంజుకుంటుండటంతో ఎక్కేందుకు యత్నించి విఫలమయ్యాడు. రైలును ఆపాల్సిందిగా క్యాబిన్‌లో ఉన్న లోకోపైలట్‌కు సైగ చేస్తూ.. రైలు వెంబడి పరుగెత్తాడు. సగం మూసుకుపోయిన తలుపుల ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ప్లాట్‌ఫాం తడిగా ఉండటంతో అదుపుతప్పి కిందపడిపోయాడు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై అతడికి పక్కకు లాగేశారు. ఒకవేళ అతడు రైలుకు, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయి ఉంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. జూన్‌ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని