గేట్స్‌ ఫౌండేషన్‌కు బఫెట్‌ గుడ్‌బై

ప్రపంచ కుబేరుడు, బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బిల్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ పదవి నుంచి ఆయన....

Updated : 24 Jun 2021 11:38 IST

న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు, బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బిల్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ పదవి నుంచి ఆయన వైదొలిగారు. బిల్‌ గేట్స్‌, మెలిందా దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దిరోజులకు బఫెట్‌ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

గత కొన్నేళ్లుగా ట్రస్టీగా కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీలంగా లేనని, ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని బఫెట్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే బర్క్‌షైర్‌ హాత్‌వే షేర్లను నూరు శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్న తన లక్ష్యాన్ని ఇప్పటికే సగం పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే, ట్రస్టీగా వైదొలగడానికి గల కారణాలను మాత్రం బఫెట్ వెల్లడించలేదు. బిల్‌గేట్స్‌, మెలిందాతో పాటు ముగ్గురు సభ్యుల బోర్డులో సభ్యుడైన బఫెట్‌.. గత 15 ఏళ్లలో సుమారు 27 బిలియన్‌ డాలర్లను బిల్‌మిలిందా ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలకు వెచ్చించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని