White House: టీకాలు తీసుకుంటేనే అమెరికాలోకి అనుమతి

కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా సడలించింది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను అనుమతించని అగ్రరాజ్యం.....

Published : 16 Oct 2021 02:18 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా సడలించింది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను అనుమతించని అగ్రరాజ్యం.. ఇకపై ఎలాంటి కారణాలు లేకపోయినా అనుమతించనుంది. ఈ మేరకు వైట్‌హౌస్‌ శుక్రవారం నూతన నిబంధనలు ప్రకటించించింది. టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీయులను నవంబర్‌ 8 నుంచి తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న స్వదేశీయులు కూడా దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.

కొవిడ్‌ కారణంగా దాదాపు 19నెలల తర్వాత కెనడా, మెక్సికో దేశాలతో ఉన్న సరిహద్దులను అమెరికా తాత్కాలికంగా మూసివేయగా దాన్ని తెరవనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. సరిహద్దుల మూసివేతతో ఆయా దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఈ సరిహద్దులు తెరుచుకోవడం ద్వారా పర్యాటకం మళ్లీ పుంజుకుంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రయాణికులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్  వేయించుకోవాలని.. అలాంటి వారికి క్వారంటైన్ అవసరం ఉండదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ప్రయాణికులు టీకా ధ్రువపత్రం, కొవిడ్‌ నెగెటివ్ ధ్రువపత్రాలు తీసుకురావాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని