Mamata Banerjee: నా రక్తాన్ని చిందిస్తా గానీ.. బెంగాల్‌ను ముక్కలు కానివ్వను: దీదీ

రాష్ట్రాన్ని విభజించాలనే ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు........

Updated : 07 Jun 2022 15:32 IST

అలీపూర్‌దూర్‌: బెంగాల్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ పలువురు భాజపా నేతలు డిమాండ్లు చేస్తున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. రాష్ట్రాన్ని విభజించాలనే ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా వేర్పాటు రాజకీయాలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఉత్తర బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు సామరస్యతతో జీవిస్తున్నారని దీదీ పేర్కొన్నారు. మంగళవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

‘‘సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో భాజపా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది. కొన్నిసార్లు గూర్ఖాలాండ్‌, ఇంకొన్నిసార్లు నార్త్‌ బెంగాల్‌ అంటూ రెచ్చగొడుతోంది. నా రక్తాన్ని చిందించడానికైనా సిద్ధమే గానీ.. బెంగాల్‌ను మాత్రం విభజన కానివ్వను’’ అని అన్నారు. ప్రత్యేక కాంతాపూర్‌ను దీదీ వ్యతిరేకిస్తే ఆమెను రక్తం కళ్లచూస్తామంటూ కాంతాపూర్‌ లిబరేషన్‌ సంస్థ నేత జీవన్‌ సింగ్లా బెదిరింపుల వీడియోపై ఆమె స్పందించారు. అలాంటి బెదిరింపులు తనను ఏమీ చేయలేవన్నారు.‘‘కొందరు వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారు.. అలాంటి వాటిని లెక్కచేయను. అలాంటి బెదిరింపులకు భయపడేదిలేదు’’ అని దీదీ స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు