₹72లక్షల మద్యం దుకాణం ₹510 కోట్లు పలికింది!

రాజస్థాన్‌లో ఓ మద్యం దుకాణం ఎవరూ ఊహించనంత ధర పలికింది. కేవలం రూ.లక్షలు విలువ చేసే మద్యం దుకాణాన్ని వేలంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు రూ.510కోట్లకు వేలం పాడి సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7వేలకుపైగా

Updated : 08 Mar 2021 16:35 IST

జయపుర: రాజస్థాన్‌లో ఓ మద్యం దుకాణం ఎవరూ ఊహించనంత ధర పలికింది. కేవలం రూ.లక్షలు విలువ చేసే ఈ దుకాణాన్ని వేలంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు రూ.510కోట్లకు సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు వేలకుపైగా మద్యం దుకాణాలను ఈ-వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో వేలంపాట నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హనుమాన్‌‌ఘఢ్‌ జిల్లాలోని నోహార్‌ నగరంలో ఉన్న ఒక మద్యం దుకాణానికి ఎక్సైజ్‌ శాఖ రూ.72 లక్షలు బేస్‌ ధరగా నిర్ణయించి వేలం మొదలుపెట్టింది. కాగా.. పలువురు వ్యాపారులు వేలంపాటలో చురుగ్గా పాల్గొని రూ.లక్షలు నుంచి రూ. కోట్లకు వేలం పాడటం ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు మొదలైన వేలంపాట అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగింది. చివరికి ఈ మద్యం దుకాణం ధర అత్యధికంగా రూ.510కోట్లు పలికింది. ఇది బేస్‌ ధర కంటే 708 రెట్లు అధికం. స్థానికంగా ఉండే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఈ వేలం పాడి మద్యం దుకాణాన్ని దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తం వస్తుందని ఎక్సైజ్‌ అధికారులు సైతం ఊహించలేదట. గతేడాది ఇదే మద్యం దుకాణం రూ.65లక్షలకే లాటరీ పద్ధతిలో కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గతంలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా వేలం నిర్వహించి కేటాయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని