Modi: సరిగ్గా 75ఏళ్ల క్రితం ఇదే రోజున తొలిసారి..

దేశ రాజ్యాంగ చరిత్రలో డిసెంబరు 9వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజునే చరిత్రాత్మక రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నేటికి

Published : 09 Dec 2021 11:31 IST

దిల్లీ: దేశ రాజ్యాంగ చరిత్రలో డిసెంబరు 9వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజునే చరిత్రాత్మక రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నేటికి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్‌ వేదికగా నాటి అరుదైన ఫొటోలను పంచుకున్నారు. నాటి సమావేశాల గురించి ఈ తరం యువత ఎంతగానో తెలుసుకోవాలన్నారు.

‘‘సరిగ్గా 75ఏళ్ల క్రితం ఇదే రోజున, మన రాజ్యాంగ పరిషత్‌ తొలిసారిగా సమావేశమైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు, భిన్న భావజాలాలు ఉన్న విశిష్ఠ వ్యక్తులు.. భారత ప్రజలకు విలువైన రాజ్యాంగాన్ని అందించాలన్న ఏకైక లక్ష్యంతో కలిసి వచ్చారు. ఆ మహనీయులకు నివాళులు. తొలి సమావేశానికి సభలో పెద్దవారైన డా. సచ్చిదానంద సిన్హా అధ్యక్షత వహించారు. ఈ చారిత్రక సమావేశానికి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా.. దీని గురించి, సభలో పాల్గొన్న ప్రఖ్యాత నేతల గురించి నేటి తరం యువత మరింత తెలుసుకోవాలని కోరుతున్నా. ఇది వారికి మేధోపరంగా ఎంతో మంచి అనుభవం అవుతుంది’’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఏడాది ముందు నుంచే బ్రిటిషర్ల కబంధ హస్తాల నుంచి భారత్‌కు విముక్తి లభిస్తుందన్న సూచనలు కన్పించాయి. దీంతో మన దేశ రాజ్యాంగ రచనకు సన్నాహాలు జరిగాయి. ఇందుకోసం తొలుత రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతోపాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. బీఎన్‌ రావు రాజ్యాంగ సలహాదారుగా నియమితులు కాగా.. ఈ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్‌ 9న జరిగింది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని