Acharya: ‘లాహే.. లాహే..’@ 35 మిలియన్‌ వ్యూస్‌

Acharya Lahe Lahe song: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కలిసి సంయుక్తంగా..

Updated : 12 May 2021 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్‌ కథానాయిక నటిస్తుండగా రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ మధ్య చిత్రం నుంచి ‘లాహే..లాహే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట చిరు అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట యూట్యాబ్‌లో 35 మిలియన్ల వ్యూస్‌ని దాటి దూసుకుపోతోంది.

రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ గీతానికి హారిక నారాయణ్‌, సాహితి చాగంటి గొంతులు సవరించగా మణిశర్మ సంగీతం అందించారు. పాట ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు అందుకుంటోంది. సినిమాకి సంబంధించి గతంలో విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’,  ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అంటూ చిరంజీవి, రామ్‌చరణ్ పలికిన ఈ సంభాషణలు అభిమానులను అలరిస్తున్నాయి. సినిమాకి నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాతలు. వాస్తవంగా ఈ చిత్రం మే13న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని