Updated : 09 Dec 2020 10:51 IST

అభిమానులను ‘ఖుషీ’ చేసిన అకీరా

తండ్రిలా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌ తనయుడు

ఫిదా అవుతున్న మెగా అభిమానులు

ఇంటర్నెట్‌డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. వెండితెరపై ఆయన పలికించే హావభావాలు చూసి అభిమానులు ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా ఆయన కొంటె చూపులు.. సిగ్గుపడుతున్నప్పుడు చిందించే చిద్విలాసం.. ఈ రెండు ఎక్స్‌ప్రెషన్స్‌కి అమ్మాయిలు మనసు పారేసుకుంటారు.  పవన్‌ కెరీర్‌లోనే పేరుపొందిన చిత్రాల్లో ఒకటైన ‘ఖుషీ’లోని పలు సన్నివేశాల్లో.. భూమికతో కొంటెగా మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. తాజాగా పవన్‌కల్యాణ్‌ కుమారుడు అకీరా సైతం అచ్చం తండ్రిలానే హావభావాలు పలికించి అభిమానుల్ని ఆకర్షించారు.

మెగా వారసురాలు నిహారిక వివాహ వేడుకలు ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య వేడుకగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్‌లో మంగళవారం సాయంత్రం పవన్‌-ఆయన తనయుడు అకీరా తళుక్కున మెరిశారు. పవన్‌ రాకతో మెగా-అల్లు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నిహారిక-చైతన్యలకు అభినందలు తెలిపిన అనంతరం పవన్‌కల్యాణ్‌-అకీరాతో తన సోదరులు చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, మెగా హీరోలు రామ్‌చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌.. వరుస ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సదరు ఫొటోల్లో ఓ చోట అకీరా.. అచ్చం తన తండ్రిలా సిగ్గుపడుతున్నట్లు ఉన్న ఓ ఫొటో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూసిన అభిమానులు.. ‘లైక్‌ ఫాదర్‌ లైక్‌ సన్‌,’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, బుధవారం రాత్రి నిహారిక మెడలో చైతన్య మూడుముళ్లు వేయనున్నారు.

ఇవీ చదవండి

నిహారిక పెళ్లి వేడుకల్లో పవన్‌కల్యాణ్‌

వేడుకగా నిహారిక మెహందీ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

DAY1: నిహారిక పెళ్లి వేడుక వీడియో చూశారా?

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని