రాముడిగా ప్రభాస్‌.. సీత పాత్రలో అనుష్క

భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ అనుష్కశర్మ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌కు చెందిన ఓంరౌత్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ప్రతినాయకుడిగా లంకేష్‌ పాత్రలో నటుడు సైష్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు....

Published : 12 Sep 2020 16:27 IST

‘ఆదిపురుష్‌’ పట్టాలెక్కేది ఎప్పుడంటే..

హైదరాబాద్‌: భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ భామ అనుష్కశర్మ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌కు చెందిన ఓంరౌత్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ప్రతినాయకుడిగా లంకేష్‌ పాత్రలో నటుడు సైఫ్‌‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు ఇటీవలే చిత్రబృందం వెల్లడించింది. ఈ తరుణంలో ‘ఆదిపురుష్‌’ చిత్రంలో కథానాయికగా, సీత పాత్రలో ప్రభాస్‌కు జంటగా ఎవరు కనిపించనున్నారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కియారా అడ్వాణీ, ఊర్శశి రౌతెలా పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం సదరు వార్తలను ఖండించింది.

కాగా, తాజాగా నటి అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ‘ఆదిపురుష్‌’లో సీత పాత్రకోసం ఇప్పటికే ఓంరౌత్‌ అనుష్కను సంప్రదించారని సమాచారం. అంతేకాకుండా దర్శకుడు చెప్పిన కథ అనుష్కకు సైతం నచ్చినట్లు.. ఆమె కూడా ప్రభాస్‌ సరసన నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క తల్లికాబోతున్నట్లు ఆమె భర్త కోహ్లీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమా సెట్‌లోకి అనుష్క.. డెలీవరి తర్వాత అడుగుపెట్టనున్నారట. షూటింగ్‌ ప్రారంభమైన వెంటనే ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌లపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాలో అనుష్క నటించనున్నారో? లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని