ఆక్సిజన్‌ సాయంతో ICUలో చికిత్స పొందాను

కొవిడ్‌-19 సోకడంతో తన ఆరోగ్యం దెబ్బతినిందని నటుడు హర్షవర్ధన్‌ రాణే తెలిపారు. ‘తకిట తకిట’ సినిమాతో నటుడిగా కెరీర్‌ ఆరంభించిన ఆయన ఆపై అనేక తెలుగు సినిమాల్లో నటించారు. ‘నా ఇష్టం’, ‘అవును’, ‘అనామిక’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’, ‘ఫిదా’ తదితర చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు......

Published : 26 Oct 2020 23:03 IST

నటుడు హర్షవర్ధన్‌ రాణే

ముంబయి: కొవిడ్‌-19 సోకడంతో తన ఆరోగ్యం దెబ్బతినిందని నటుడు హర్షవర్ధన్‌ రాణే తెలిపారు. ‘తకిట తకిట’ సినిమాతో నటుడిగా కెరీర్‌ ఆరంభించిన ఆయన పలు తెలుగు సినిమాల్లో నటించారు. ‘నా ఇష్టం’, ‘అవును’, ‘అనామిక’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’, ‘ఫిదా’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు. ‘సనమ్‌ తేరీ కసమ్‌’తో కథానాయకుడిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో తన తర్వాతి సినిమా ‘తైష్‌’ ప్రచారంలో కూడా పాల్గొనలేకపోయానని తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఆయనతోపాటు పుల్కిత్‌ సామ్రాట్‌, కృతి కర్బందా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. అక్టోబరు 29న ఓటీటీ వేదికగా జీ5లో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. ‘నేను నాలుగు రోజులపాటు ఐసీయూలో ఉన్నా. ఆక్సిజన్‌ సాయంతో ఊపిరి పీల్చుకున్నా. నా సినిమాను ప్రమోట్‌ చేసుకోలేకపోతున్నానని బాధపడ్డా. తొలుత తలనొప్పి, స్వల్ప జ్వరం వచ్చాయి. నాలుగు రోజులు గడిచినప్పటికీ తలనొప్పి తగ్గలేదు. దీంతో ఆసుపత్రికి వెళ్లా. ఇది కేవలం వైరల్‌ జ్వరమని వైద్యలు చెప్పారు. ఆపై కరోనా పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. రెండు రోజులైనా జ్వరం, తలనొప్పి తగ్గకపోవడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లా. నా ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఐసీయూకి తరలించి, చికిత్స చేశారు’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని