నెటిజన్లకు ఆమిర్‌ఖాన్‌ కుమార్తె వార్నింగ్‌

స్టార్‌ హీరో ఆమీర్‌ఖాన్‌ కుమార్తె ఇరా ఖాన్‌ నెటిజన్లకు చిన్న వార్నింగ్‌ ఇచ్చారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఇరా ఓ వీడియోని నెట్టింట్లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల నుంచి తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని.. దాని నుంచి బయటపడేందుకు...

Published : 17 Oct 2020 13:24 IST

ముంబయి: స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఇరా ఖాన్‌ నెటిజన్లకు చిన్న వార్నింగ్‌ ఇచ్చారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఇరా ఓ వీడియోని నెట్టింట్లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల నుంచి తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని.. దాని నుంచి బయటపడేందుకు వైద్య సహాయం పొందుతున్నానని.. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని ఆమె సదరు వీడియోలో పేర్కొన్నారు. అయితే ఆమె పెట్టిన వీడియోకి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. మానసిక కుంగుబాటు గురించి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పినందుకు కొంతమంది ఆమెను ప్రశంసించగా.. మరికొంతమంది మాత్రం ఆమెపై నెగెటివ్‌ కామెంట్లు చేయడం ప్రారంభించారు.

కాగా, ఇరా ఖాన్‌ వీటిపై స్పందించారు. ‘ఒకవేళ మీరు నెగెటివ్‌ కామెంట్లు పెడితే నేను వాటిని నా పోస్ట్‌ నుంచి తొలగిస్తాను. మరోసారి ఇలా చేస్తే మీరు నా పోస్ట్‌లు చూడకుండా బ్లాక్‌ చేస్తా’ అంటూ నెటిజన్లను హెచ్చరించారు. దీనికంటే ముందు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోల్‌ నిర్వహించారు. ‘మానసిక ఆరోగ్యం గురించి నేను చేస్తున్న పోస్ట్‌లకు వస్తోన్న అనవసరమైన కామెంట్లను బ్లాక్‌ చేయనా?’ అని ఆ పోల్‌లో పేర్కొన్నారు. 56 శాతం మంది నెగెటివ్‌ కామెంట్లను బ్లాక్‌ చేయాలని కోరారు. మరోవైపు ఇలాంటి‌ కామెంట్లు తనని ఏమాత్రం ఆందోళనకు గురి చేయవని ఆమె వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు