రానాకు మిహీకా స్పెషల్‌ మెసేజ్‌

నటుడు రానా, మిహీకాలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటీవల వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. కరోనా, లాక్‌డౌన్‌

Published : 16 Aug 2020 00:43 IST

హైదరాబాద్‌: నటుడు రానా, మిహీకా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటీవల వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. కరోనా, లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా అతి కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వేడకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. తాజాగా తన భర్త రానా గురించి మిహీకా ఓ ప్రత్యేక సందేశాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు.

రానాతో కలిసున్న ఫొటోను పంచుకుంటూ ‘‘మై లవ్‌.. మై లైఫ్‌.. మై హార్ట్‌.. మై సోల్‌.. నా సర్వస్వం నువ్వే అయినందుకు ధన్యవాదాలు. ఇంతలా నా కల నిజమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నన్ను మరింత ఉన్నంతమైన వ్యక్తిగా మార్చావు. ఐ లవ్‌ యూ’’ అని మిహీకా పేర్కొన్నారు. మిహీకా పోస్ట్‌కు సమంత, బంటి బజాజ్‌, వెంకటేశ్‌ కుమార్తె అశ్రితలు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని