Bheemla Nayak: అంత ఇష్టం.. భీమ్లా

సంక్రాంతి బరిలో నిలిచేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది ‘భీమ్లానాయక్‌’. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. రానా మరో హీరోగా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. సూర్య దేవర నాగవంశి  నిర్మిస్తున్నారు.

Updated : 07 Dec 2022 16:37 IST

సంక్రాంతి బరిలో నిలిచేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది ‘భీమ్లానాయక్‌’. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. రానా మరో హీరోగా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. సూర్య దేవర నాగవంశి  నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిపై రూపొందిన ‘‘అంత ఇష్టం’’ అనే గీతాన్ని.. దసరా సందర్భంగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు     మంగళవారం సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త లుక్‌ను పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో పవన్‌.. నిత్యల జోడీ చూడముచ్చటగా కనిపించింది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పవన్‌.. భీమ్లా నాయక్‌ అనే పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. డేనియల్‌ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా సంయుక్త మేనన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని